Tuesday 9 August 2011

లక్ష్య ప్రకటన

లక్ష్య ప్రకటన
a దివ్య శక్తికి ధన్యవాదాలతో ,,
మేధోపజీవిగా నిరంతరం ప్రగతి ఆలోచనలు చేస్తాను
ఎల్లప్పుడూ అందరికీ మంచి జరగాలని కోరతాను  జరుగుతుందని నమ్ముతాను
జగథ్సుఖం కోసం నావంతు ప్రయత్నం చేస్తాను

b తల్లి దండ్రులకు విధేయునిగా ,,
వారు ఆనందించే మంచి పనులు చేస్తాను
వారు కీర్తించ బడే విధంగా కార్యాచరణలు చేస్తాను
వారిని సేవిస్తాను నావారితో సేవింప చేస్తాను

c సమాజ శ్రేయోదాయకుడిగా ,,
సమాజానికి నా విద్యను తెలివిని అందిస్తాను
బోధనల తో వర్గ వైషమ్యాలను పోగొడతాను
చేతనైన ఆర్థిక సహాయం చేస్తాను చేయిస్తాను
మహిళ, బాల ,పెద్దలకు (అనాథ)అండగా ఉంటాను
నిరుపేద రోగులకు సహాయం చేస్తాను
రక్త ,నేత్ర ,శరీర,దానాలను ప్రోథ్సహిస్తాను

d భార్యకు నిత్య నూతన ప్రేమికుడిగా ,,
గాజు బొమ్మలాగ అపురూపంగా చూస్తాను
వినోద విహారాలతో ముంచెత్తుతాను
తనకోసం వ్యాయామాలతో మితాహారం తో సన్నబడతాను
మంచి కోరికలు తీరుస్తాను,ఇల్లు కడతాను
దాన్ని పెద్దవయస్సు లో కూడా ఈ రకంగానే చూసు కొంటాను
అవసరమైతే 3 సం,, చిన్న పిల్లగా కూడా చూస్తాను

e సంతానానికి రక్షకుడిగా ,,
దురలవాట్లకు దూరంగా  అత్యుత్తమ ఆదర్శంగా ఉంటాను
అత్యుత్తమమైన వనరులు అందిస్తాను 1 విద్య 2 పరిసరాలు 3 వ్యక్తులు 4 సమాచారం
దైవానికీ దేశానికీ పెద్దలకూ ఎల్లప్పుడూ ఒదిగి ఉండాలని నేర్పిస్తాను
తగిన వయస్సు రాగానే పూర్తి  స్వాతంత్ర్యాన్నిస్తాను
శక్తిమేరా సహాయం చేస్తాను

f తమ్ములకు అండగా ,,
ఆస్కార తిరస్కారాలతో ప్రమేయం లేకూండా తగిన సలహా సంప్రదింపులు చేస్తాను
మేము (నేను శ్రీదేవి హిందుస్థాన్) అవమానింప బడినా సోదర బంధం బలహీన పడనీయను
నన్ను నాసిద్ధాంతాలను దూషించినా పట్టించు కోను
ఎల్లప్పుడూ ఎటువంటి సహకారానికైనా సహాయానికైనా సిద్ధం గా ఉంటాను

g బంధు మిత్రులకు ఆనందాన్నిస్తూ ,,
ఎదుటా బైటా వకే రకమైన కపటం లేని ఉల్లాస భరిత వైఖరితో ఉంటాను
మంచి విషయాలు మాత్రమే చూస్తాను వింటాను మాట్లాడతాను
కష్ట నష్టా ల్లొ నేనున్నాను అనే భరోసా కల్పిస్తాను
రహస్యాలు కాపాడతాను బంధు మిత్ర వైరుధ్యాలను నా స్వప్రయోజనాలకు వాడుకోను




h అనుచరులకు మార్గ దర్శకుడిగా
కాలం లో జరిగిన  జరుగుతున్న జరుగబోయో మార్పుల్ని గమనించి ఉపాయాలని తెలుపుతాను
నా కన్నా గొప్ప వాళ్ళ గా వాళ్ళను మార్చుతాను
గెలిచి గెలిపించే ధోరణి కలిగిస్తాను

i సిద్ధాంతాలున్న మనిషిగా  ,,
1 ఎల్లప్పుడూ సిద్ధాంతాల నుండి ప్రేరణ పొందుతాను
2 మంచి మార్పుల్ని ఎల్లప్పుడూ ఆహ్వానిస్తాను
3 మార్చగల వాటిని మారుస్తాను
4 తప్పనిసరి మార్పుల్ని ఆమోదిస్తాను
5 ప్రభావ క్షేత్రం లో ఆలోచిస్తాను పనిచేస్తాను
6 ఎంపికా స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటాను
7 క్రియా సంసిద్ధుడు గా ఉంటాను
8 క్రియల్ని పరి పూర్ణ ధ్యాసతో ఆరంభిస్తాను
9 ఉద్వేగ రహిత పాత్రోచిత ప్రవర్తన కలిగి ఉంటాను
10 సాధారణ ముఖ్య కార్యాలయందు నిమగ్నుడనై ఉంటాను
11 సమస్యలో కాకూండా పరిష్కారం లో భాగంగా ఉంటాను
12 ఇతరులకి నేను ముద్రల్ని వేయను ఇతరులు వేసిన ముద్రల్ని నమ్మును
13 గోరంతటి విషయాల్ని కొండంత విషయాలు గా మార్చను
14 అంతఃకరణ ఖాతా ల్లో జమలు చేస్తాను సక్రమ నిర్వహణ చేస్తాను
15 దయకలిగిన ధైర్యం తో ఉంటాను
16 పుష్కల మనస్తత్వం కలిగి ఉంటాను
17 సహానుభూతశ్రవణం చేస్తాను
18 నా ఆశింపుల్ని స్పష్టం చేస్తాను
19 గెలుపు/గెలుపు లేదా ఒప్పందం రద్దు ను పాటిస్తాను
20 భిన్నాభిప్రాయాల్ని గవ్ రవిస్తాను
21 అధిక ప్రేమ/అధిక సేవ/అధిక వితరణ/అధిక నమ్మకం/అధిక మమకారం కలిగి ఉంటాను
22 తక్కువ స్వార్థం/తక్కువ శత్రుత్వం/తక్కువ ఆత్మ రక్షణ/తక్కువ తీర్పరితనం/తక్కువ రాజకీయం చేస్తాను
23 ఒంటరి గా కాక కలసి పని చేయటానికి ప్రాధాన్యతనిస్తాను
j
పండితుడిగా,,
1 ప్రతిరోజూ ఒక కొత్త విషయం తెలుసు కొంటాను
2 తెలుసుకొన్న విషయాలను అందరితో పంచుకొంటాను
3 నాతోను ప్రపంచం తోను నిజాయితీ గా ఉంటాను
4 సలక్షణ ఘనాంతం- జిల్లా,రాజమండ్రి పట్టాలు సంపాదిస్తాను
5 ముఖ్య మైన సూక్తి ముక్తావళి  శ్లోకాల్ని సవివరంగా తెలుసు కొంటాను
6 విద్యరణ్య వేదభాష్యం కంచి జిల్లా పట్టాల్ని సంపాదిస్తాను
7 ఆంగ్లంలో,హిందీలో పట్టాలు సంపాదిస్తాను
8 బి,ఎ,పూర్తి చేస్తాను
9 10,ఎమ్,ఎ,లు చేస్తాను
10 డాక్టరేట్ పొందుతాను( పి,హెచ్,డి,చేస్తాను)


0 వ్యాఖ్యలు: